Saturday, September 30, 2017

కోల్పోక నీ అభిప్రాయాన్ని !



నేను సినిమా దగిర నుంచి చుసిన సాదా సీదా మనిషిని, ఫిలిం మేకింగ్, స్క్రీన్ రైటింగ్ కోర్స్ లు చేసిన ఒక సినిమా పిటిచోడ్ని.




మీరు సినిమా చూసే వారు ఐతే ఇది చదవండి.




ఈ రోజు నేను రాజముండ్రి అశోక స్వామి సినిమా హాల్స్ దగిర కి వేళ్ళ జైలవ కుశ సినిమా కి బాగా జనం ఉన్నారు, సరే ఎలాగో ఆ సినిమా రెండు సార్లు చూసేనుకదా పక్కన ఆడుతున్న స్పైడర్ సినిమా కి కూడా రెండో సారి వెళదాం అనివేళ్ళ. పెద్ద లైన్ లేదు కానీ ఒక ఇద్దరు ముందునుంచున్నారు టికెట్ ల కి. నా ముందు ఉన్నఒకడు కాల్ చేసి ఎరా స్పైడర్ వొచ్చిందా?ప్రింట్ ఎలా వుంది?

బాగుందా?

సరే బాగానేచెప్పావ్ కొంచెం లో ౩౦౦ బొక్క అయేవి. ఇంట్లో వుండు పెన్ డ్రైవ్ తెస్తున్నా. అని వెళ్ళిపోయాడు. నాకుచాలా బాధ వేసింది 'కాలర్ పట్టుకొని లాగోటికొట్టాలి అనిపించింది'. టికెట్ తీస్కొని ఎదురుగా ఉన్న టీ షాప్ కి వెళ్లి టీ చెప్ప.


ఈ లోపు పక్కన ఉన్న వారుమాట్లాడుకుంటున్నారు. స్పైడర్ సినిమా అసలా బాగోలే అంట అని. నేను అడిగేసా, మాస్టర్ మీకు ఎవరు చెప్పారు అని. అతను అన్నాడు నేను నా ఫోన్లో రివ్యూ చదివా బాబోయ్ అసలా బాగోలే. నాకు కోపం తారాస్థాయి కి చేరింది.? నేను వెంటనే మీరు ఏదైనారివ్యూ చుసేకే వెళ్తారా ? అని అడిగా. అవును నేను అన్ని రివ్యూ లు చూసే వాడతా అన్నాడు? "మీ పెళ్ళి కి ముందు మీ పెళాన్ని ని ఎవడు రివ్యూ చేసేడు. ఆవిడికిరేటింగ్ ఎంత ఇచ్చేరు", అని నా మనసు లోనేను అనుకున్న. అంతే కదా మరి. మూడుగంటల సినిమా కి రివ్యూ నీ బట్టి వెళ్లాలో లేదో తెలుసుకునపుడు జీవితం అంత నీతోవుంటారు.




మూడ్ పాడైంది ఆ తరువాత టైం అయింది అని సినిమా కి వేళ్ళ. మొత్తానికి థియేటర్ నిండింది. ఇంటర్వెల్లో నా పక్కన కూర్చున్న ముసలి అతను 'సినిమా బాగానే ఉంది' అన్నారు. సెకండ్ హాఫ్ అయింది లేచాం. మళ్ళి మూసల అతను "ఎందుకు ఈసినిమా ని బాగోలే అనారో పాపం".






మా తరం లో సినిమా కి వెళ్తేసొంతం గ రుచి చెప్పే స్వేచ్ఛ ఉండేది ఇపుడు వ్యక్తిత్వాలు కూడా సెల్ ఫోన్ లోదొరికేస్తున్నాయి అన్నారు.




అయన చెప్పింది నూటినూరు సేతం నిజమే మనకు అని ఆన్ లైన్ లో దొరికేస్తున్నాయి. ఆఖరికి మన నిర్ణయాలు కూడా. మనం నెట్ ని ప్రేమించట్లే సహజీవనం చేస్తున్నాం, మన ప్రతి కదలిక అదే శాసిస్తుంది.




ఒక్క నిమిషం ఆలోచిస్తే ఆ ఒక సినిమా కి ఎంత మంది పని చేసి ఉంటారు ? ఎన్ని రోజు లు తీసి ఉంటారు ? ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఉంటారు ? మనం ఎలా ఒకరు రాసిందో లేక చేపిందో విని ఆ సినిమా బాగోలే అని నిర్ణయం తీసుకుంటాం ?




అసలా నా దృష్టి లో పైరసీ మూవీ చూడ్డం అంటే చెత్త కుండీ ఫై పడ్డ బిర్యానీ ప్యాకెట్ ఇంట్లో డైనింగ్ టేబుల్ ఫై కూర్చొని తినడం తో సమానం. సినిమా హాల్ లో చూడలేకపోతే ఆగండి మూడు నెలలో టీవీ ఛానల్ లో వేస్తాడు మంచి క్వాలిటీ అది చుడండి.




మా ఇష్టం మా రైట్ అంటారా? మరి ఆ మూవీ కి వర్క్ చేసిన 1000 మంది రైట్ ని దొబ్బేసే రైట్ మీకు ఎవడు ఇచ్చాడు ?




అసలా సినిమా అంటే మన కు రిలాక్సేషన్ ఇచ్చే ఒక చక్కటి వినోదం, వినోదం అంటే కామెడీ ఆర్ ఫైట్స్ ఒకటే కాదు అది జెనెర్ బట్టి ఉంటుంది. జెనెర్ తెలుసుకొని మూవీ కి వేలండి.




టీజర్ ట్రైలర్ లేక పాటలు మీకు నచితే ఆ సినిమా చుడండి. మీకు మీరు గా చెప్పండి బాగుంది బాగోలేదో.




మర్చిపోకండి మీరు సినిమా థియేటర్ కి మాత్రమే వెళ్తున్నారు కోర్ట్ కి కాదు! జడ్జిమెంట్ కోసం నిర్మాతలు కోట్లు పెట్టి రిలీజ్ చేయరు. బాగుంటుంది అందరకి నచుతుంది అని మాత్రమే ఏ సినిమా అయన తీస్తారు.




మీ సొంత అభిప్రాయం చెప్పండి సినిమా ని బతికించండి. మీరు సినీ ప్రేమికుడు ల సినిమా ని సినిమా హాల్ లో మంచి సౌండ్ పెద్ద తెర ఫై మీ అభిమాన తరాల ని చుడండి. మీరు పెటే డబ్బులు లకి సినిమా న్యాయం చేస్తుంది.




ఇంకోటి పిచ్చ అభిమానం మంచిదో కాదో పక్కన పెడితే అసూయా బురద జల్లడం అసలా మంచివి కావు. ఇది చెడు పరిణామం. ఈరోజు సినిమా ఒక హీరో తో ఆగదు. ఈ చెడు సంప్రదాయం వల్ల అందరకి చాలా నష్టం.




సినిమా బతికితే నే మన అభిమాన నటి నటులు దర్శకులు నిర్మాతలు వాలా వల్ల ఇండస్ట్రీ పని చేసే ప్రతి కార్మికుడు బాగుంటాడు. ఇది కూడా సాయం చేయడం లాంటి దే. సాయం ఎవరకి చేస్తారు ఇష్టం వాచినట్టు ఏసీ లో కూర్చొని రేటింగ్ ఇచ్చే వారికా? లేక ఎండా వాన లెక్క చేయకుండా కష్ట పడి ఎలాంటి పరిస్థితుల్లో అయన సినిమా ని మీ ముందుకు తీసుకొచ్చే వాళ్ళకా?






చూసి చెప్పు పక్కన వాడిని అడిగి కాదు ! అయినా అడగడానికి వాడేం నీ స్కూల్ లో మాస్టర్ కాదు. తోటి ప్రేక్షకుడే!!






నేను క్రిటిక్ కి వేతిరేకం కాదు రేటింగ్ కి మాత్రమే ! ఒక వారం తరువాత రాయి డిస్టిబ్యూటర్ జేబులు కొట్టాక నువ్వు రాయి నేను చదువుతా నా విశ్లేషణ తో పోల్చుకుంట! తినేలోపే మెనూ టేస్ట్ అని చెప్పేస్తే ఇంకా నాకేం ఉంటుంది కిక్! సినిమా అంటే సర్ప్రైజ్..


ఇది ఒక సినిమా వల్ల వచ్చిన బాధ కాదు చాలా రోజులు మదిలో మెదులుతున్న గాధ . సినిమా లో ఛాన్స్ లు కోసం ప్రయత్నిస్తున్న. ఏదో రోజు నా సినిమా కి ఇలాంటి పరిస్థితి వస్తుందేమో అనే భయం కూడా ఒక కారణం కావచ్చు. ఓపిక గా చదివినందుకు ధన్యవాదాలు




- మీ Mr వితేజ్






[For talented best Critics: If you want to rate the film then do with Foreign films. Indian Telugu films need your services after sometime]

Note: ఫిలిం యూనిట్ కూడా ఒక గర్భిణీ స్త్రీ ల అన్నేసి నెలలు మోసి కష్టపడి ఒక సినిమా ని రిలీజ్ చేస్తే కలర్ తక్కువ మొద్దు వేస్ట్ అంటే ఆ టీం కి ఎలా ఉంటుంది ? 

మంచి మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ చెడుని వ్యాపించకండి!