గోదావరి కాలవ కి ఆ పక్క ఓ ఊరు మరో పక్క ఇంకో ఊరు. పచ్చని పంట పొలాలు. సవత్సరాది అంటే ఉగాది అనే మాత్రమే తెలిసిన మనుషులు, భోగి మంటల కోసం ఉదయాన్నే 3 గంటలకి లేచి వాలా ఊర్లోకి సూర్యుడ్ని తెచ్చారు. అందమైన ఈ పల్లెటూరులో జనాలు మధ్య ప్రేమలతో పటు గ మొహమాటాలు, కోపాలు కూడా ఉండనే ఉంటాయి!
రాజయ్య కూతురు మల్లేశ్వరి కి గాలిపటం కోసం చెప్తున్నాడు. పక్క ఊరు సింహాద్రి తన చిన్న తమ్ముడు బలరాం కి గాలిపటం ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు, తండ్రి లేని లోటు ఎప్పుడు తెలియనివాడు. అంతటా సందడి పండగ అంటే పల్లెటూరులే గ మరి.
గాలిపటాలు ఆకాశాన్ని ముస్తాబు చేస్తున్నాయి. మరింత ఆనందాన్ని ఇస్తున్నాయి. రంగు రంగుల హరివిల్లు ఇంద్రధనస్సు ల కన్ను కి కనువిందు చేస్తున్నాయి. మల్లేశ్వరి కి వాలా నాన్న దారం తో జరిగే ప్రమాదం, గాలిపటం ఎలా వేయకూడదో చెప్తుంటే, బలరాం కి వాళ్ళ అన్నయ ఎలా ఎగరేయాలో చెప్తూనే తన కన్నా పై కి దూరం వేయలేవు అని సవాల్ విసురుతున్నాడు సరదాగా. బలరాం బుర్రకి ఒక ఆలోచన తడుతుంది, గాలిపటం పై తన పేరు ఊరు వీధి రాస్తాడు. ఏదో ఉత్తరం లాగా!
మల్లేశ్వరి పచ్చ గాలిపటం వాలా ఇల్లు దాటింది. బలరాం పటం ఎగరెట్లే పాపం. కాసేపుటికి పటాలు చిన్న గ కానిస్తున్నాయి నింగి లో. బలరాం ఎర్ర పటం తెగిపోయింది. సింహాద్రి గట్టి గ నవ్వుతూ తమ్ముడు ని ఉడికిస్తున్నాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. రాజయ్య వచ్చి దారాన్ని వాలా చెట్టు కొమ్మకి కట్టి, కూతురు తో చీకటి లో ఆడకూడదు. నీ అదృష్టం బాగుంటే రేపటికి పటం ఎగురుతూనే ఉంటుంది అని చెప్తాడు.
ఆ రాత్రి మల్లేశ్వరి కి నిద్ర పట్టదు. కిటికీ వైపు చూస్తూ ఉంటుంది. బలరాం ఇంట్లో ఒక మూలకి వెళ్లి తరువాత రోజు కోసం ఒక గాలిపటం చేసుకుంటున్నాడు. ఉదయం అవుతుంది మల్లేశ్వరి డాబా పై కి ఎక్కి చూస్తుంది పటం జడ లేదు. మల్లేశ్వరి నాకు అదృష్టం లేదు అని అంటూ ఏడుస్తుంది. రాజయ్య చూసి ఏడవక ఆ పటం ఆకాశం లో ఉన్న మీ తాతయ్య దగ్గిర కి వెళ్లిపోయిందేమో అని అంటాడు.
సంక్రాతి రోజు పండగ మరింత అట్టహాసం గ జరుగుతుంటుంది. రాజయ్య కుటుంబం గుడి కి వెళ్తుంది. అక్కడ కింద పడిన గాలిపటం చూస్తుంది మల్లేశ్వరి. ఇంటికి తిరిగి వెళ్లే అప్పుడు ఇంకో రెండు పటాలు చూస్తుంది. కానీ తన పచ్చ గాలిపటం మాత్రం కనిపించలేదు. ఓ పటం పై 'బలరాం, మామిడి తోట వీధి, బుర్రిలంక' అని రాసి ఉంటుంది.
అప్పుడు తండ్రి మాటలు "ఆకాశం లో ఉన్న తాతయ్య దగ్గిరకి వెళ్ళిపోయింది". మల్లేశ్వరి గాలిపటం పై న రాస్తుంది 'తాతయ్య గారు బాగున్నారా? నా పచ్చ గాలిపటం వెనక్కి పంపించండి కావాలంటే ఈ పటం తీస్కోండి' అని.
బలరాం స్నేహితులతో కాలవ దగ్గిర కాళీ స్థలం నుండి వేస్తాడు. ఆ రోజు బలరాం కి పచ్చ పటం దొరుకుతుంది. ఆ రాతలు చూసి భలే నవ్వుకుంటాడు. నేను నా పేరు చిరునామా రాశా. ఎవరో చెనిపోయిన తాత గారు కి రాసారు. ఇంటికి వెళ్లిన బలరాం కి ఆలోచన వస్తుంది. వెంటనే పచ్చ పటం తాయారు చేస్తాడు అన్నయ సహాయం తో. దొరికిన గాలిపటం లాగా నే.
కనుమ రోజు అంతటా వేటలు, నైవేజ్యాలు. మల్లేశ్వరి ఏమో దేవుడు కి దండం పెడుతుంది తన మొదట వేసిన పచ్చ గాలిపటం వాలా తాతయ్య వెనక్కి పంపేయాలి అని. బలరాం కాలవ కి వేరే దిక్కు వెళ్లి తాయారు చేసిన పచ్చ గాలిపటం ఎగరేస్తాడు. మల్లేశ్వరి డాబా పై కి ఎక్కి చూస్తుంది, ఒకటే ఆనందం పచ్చ పటం. దాబా దిగి పరుగు పెడుతూ ఉంటుంది. గాలిపటం దగ్గిరకి వచ్చేస్తుంది. వీధి చివర గోదారి కాలవ దగ్గిర చెట్టు కి చిక్కుకుటుంది. మల్లేశ్వరి చెట్టు దగ్గిర ఆగి ఏడుపు మొఖం తో చూస్తుంది.
చిక్కుకున్న పటం కోసం తెప్ప ఎక్కి మరి ధాటి వస్తాడు బలరాం. చెట్టు దగ్గిర కి వస్తాడు. చెట్టు కింద ఉన్న మల్లేశ్వరి ని చూస్తాడు. చెట్టు ఎక్కుదము అనుకునే లోపు గాలి కి ఆ పటం మల్లేశ్వరి చేతిలో పడుతుంది. వెంటనే భావోద్వేగం కన్నీరు మాత్రం ఆగలేదు. బలరాం కి ఆ క్షణాలు మర్చిపోలేనివి. ఈలోపు తెప్ప ఆటు వెళ్తుంది రా రా అని స్నేహితుడు అరవటం తో పరిగెడతాడు. మల్లేశ్వరి ని వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ .. ఊరు కే వినిపించే అంత గట్టి గ అరుస్తాడు. "తాతయ్య గారు బాగున్నారు! మీరు బాగున్నారు!"
చిన్న వారు అయన ఆ సంఘటన మర్చిపోలేనివి. బహుశా దీన్ని ప్రేమ అంటారేమో. ముక్క కనుము పండగ అయన ఆకాశం లో రెండు పటాలు ఎగురుతూనే ఉన్నాయ్. ఊరు అందరకి పండగ ముగిసిన వీళ్లకి రోజు బడి నుండి రాగానే పటాలు పండగే. ప్రతి పటం పైన ఏదోటి రాసేవారు ఇద్దరు. తెప్ప కూడా ఎక్కే అవసరం రాలేదు. కానీ వీళ్లు గాలిపటాల తో ప్రేమించుకున్నారో లేక వీళ్ల పటాలు ప్రేమించుకుంటున్నాయో అంటూ సాగింది. ఆకాశం లో!! పచ్చ ఎర్ర పటాలు. ఆ ఊర్లలోనె భలే ఫేమస్..!
ఈ ప్రేమ కథ లో మల్లేశ్వరి కుటుంబం లేదా బలరాం బాధ పడలేదు. వాలా కులాలు అడ్డు రాలేదు. ఏ గొడవలు లేవు. కచ్చితంగా వీళ్లు మాత్రం ప్రేమించుకుంటూనే ఉంటారు ఆకాశం ఉన్నత కాలం!! వీళ్ల ప్రేమ కి సాక్షం ఆకాశం - గోదావరి!
ప్రేమ అంటే ఒకటవడం కాదు, ఒకరి కోసం ఒకరు ఆలోచన చేయడం, ఒకరి మనసు లో ఒకరు ఉండడం! పెళ్లి ఐతే నె ప్రేమ గెలుస్తుందా? కలిసి తిరిగితేనే ప్రేమ? నా వరుకు ప్రేమ అంటే జీవితం అంత ఉండే భావోద్వేగం. ఒకసారి ప్రేమించడం అంటే జీవితం అంత అని .
గాలిపటం పై నా 'గాలి పాఠం'!
- MrVitej
No comments:
Post a Comment